మాసివ్ “పఠాన్” 1000 కోట్లతో రేర్ రికార్డ్.!

Published on Feb 21, 2023 4:03 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “పఠాన్”. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడ నటించిన ఈ సినిమా రిలీజ్ అయ్యిన నాటి నుంచి మాసివ్ ఓపెనింగ్స్ మరియు వసూళ్లతో రికార్డులు బ్రేక్ చెయ్యగా మేజర్ గా హిందీ వసూళ్లతోనే ఇప్పుడు పఠాన్ ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ రికార్డు అయితే సెట్ చేసింది.

మరి కొన్ని రోజులు నుంచి చూస్తున్న 1000 కోట్ల సాలిడ్ వసూళ్ల క్లబ్ లోకి ఈ చిత్రం నిన్న సోమవారం వసూళ్లతో అయితే 1000 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని టచ్ చేసి బాలీవుడ్ నుంచి రెండో చిత్రంగా సెన్సేషన్ ని రేపింది. అంతే కాకుండా ఇండియన్ సినిమా నుంచి అయితే టాప్ 5వ సినిమాగా నిలిచింది. ఇక దీనితో పాటుగా ఈ సినిమా ఫేజ్ 1 నుంచి రిలీజ్ అయ్యి ఈ మార్క్ ని అందుకున్న ఫస్ట్ సినిమాగా నిలిచినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే షారుఖ్ హిస్టరీ క్రియేట్ చేసారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :