1000 కోట్ల దిశగా “పఠాన్”.!

Published on Feb 19, 2023 10:10 am IST

బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్తం “పఠాన్” ఇప్పుడు హిందీలో సహా వరల్డ్ వైడ్ గా కూడా బాలీవుడ్ సత్తా చాటింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం షారుఖ్ కెరీర్ లో ఓ రికార్డు బ్రేకింగ్ కం బ్యాక్ గా నిలవడమే కాకుండా నార్త్ బెల్ట్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా దూసుకెళ్తుంది.

ఇక అలాగే మేజర్ గా హిందీ వసూళ్లతోనే ఏకంగా 1000 కోట్ల గ్రాస్ దిశగా ఈ చిత్రం ఇప్పుడు దూసుకెళ్తూ బాలీవుడ్ లో మరో సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసింది. వీకెండ్స్ లో అదరగొడుతున్న ఈ సినిమా ఈ వారాంతానికి ఆల్ మోస్ట్ గా 1000 కోట్ల దగ్గరకి వచ్చేసింది. దీనితో ఈ చిత్రం నెక్స్ట్ వీక్ నాటికి స్యూర్ షాట్ గా ఈ మార్క్ ని అందుకుంటుంది అని చెప్పొచ్చు. దీనితో ఇండియన్ సినిమా దగ్గర మరో 1000 కోట్ల సినిమాగా అయితే ఇది నిలవనుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ సాలిడ్ క్యామియో లో కనిపించగా తన ప్రెజెన్స్ సినిమా వసూళ్లకు భారీగా ప్లస్ అయ్యింది.

సంబంధిత సమాచారం :