వరల్డ్ వైడ్ రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకున్న “పఠాన్”.!

Published on Jan 26, 2023 4:00 pm IST

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “పఠాన్”. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ సినిమా షారుఖ్ నుంచి పర్ఫెక్ట్ కం బ్యాక్ సినిమాగా నిలుస్తుంది అని అంతా ఆశించినట్టే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి మళ్ళీ షారుక్ అయితే కం బ్యాక్ ఇచ్చినట్టే కన్ఫర్మ్ అయ్యింది.

ఇక అంచనాలకి తగ్గట్టే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు వారు అంచనా వేయగా ఈ చిత్రం ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా 100 కోట్లకి పైగా ఓపెనింగ్స్ అందుకొని బాలీవుడ్ మొదటిసారిగా ఫస్ట్ డే కి రికార్డు బ్రేకింగ్ ఓపెనర్ గా నిలిచినట్టుగా తెలుస్తుంది.. దీనితో షారుఖ్ ఖాన్ ఇచ్చిన కం బ్యాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా జాన్ అబ్రహం విలన్ గా నటించాడు.

సంబంధిత సమాచారం :