బాలీవుడ్ లో “పఠాన్” లేటెస్ట్ వసూళ్లు.!

Published on Feb 11, 2023 12:54 am IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా జాన్ అబ్రహం విలన్ గా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “పఠాన్”. షారుఖ్ అభిమానులతో పాటుగా బాలీవుడ్ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ మాసివ్ కం బ్యాక్ అయితే ఇప్పుడు ఈ సినిమాతో అందింది. ఇక ఈ సినిమా ఇండియా వైడ్ అయితే బరి వసూళ్లతో హవా ఇప్పుడు కొనసాగిస్తోంది.

ఇక హిందీలో అయితే మాసివ్ రన్ తో మూడో వారం కూడా అదరగొడుతున్న ఈ చిత్రం రీసెంట్ గానే అక్కడ కేజీయఫ్ 2 ని క్రాస్ చేసి బాహుబలి 2 వెనుక అయితే ఉంది. ఇక ఇప్పుడు నిన్న గురువారం 5.75 కోట్లు గ్రాస్ రాబట్టి హిందీలో మొత్తం 442.5 కోట్లకి చేరుకుంది. ఇక వీకెండ్ కూడా వస్తుండడంతో ఈ శనివారం నాటికి 450 కోట్ల మార్క్ ని ఈ చిత్రం అందుకుంటుంది అని చెప్పొచ్చు. మరి అనుకున్నట్టుగా బాహుబలి 2 ని కూడా ఈ సినిమా క్రాస్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :