ఆడియెన్స్ కి షారుఖ్ “పఠాన్” టీమ్ క్రేజీ ఆఫర్!

Published on Feb 16, 2023 2:49 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ 500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. ఈ సందర్భంగా, ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పఠాన్ మేకర్స్ క్రేజీ ప్లాన్ వేశారు. నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ టికెట్ ధరను దేశవ్యాప్తంగా 110 కి ఫిక్స్ చేసింది.

PVR, Inox మరియు Cinepolis వంటి మల్టీప్లెక్స్ చెయిన్‌లలో రేపటి షోలకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. మళ్లీ థియేటర్లలో సినిమా చూడాలనుకునే అభిమానులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. జాన్ అబ్రహం విలన్ గా నటించిన ఈ బిగ్గీలో సిజ్లింగ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటించింది. పఠాన్‌కు విశాల్, షేఖర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :