నార్త్ లో 500 కోట్లకి చేరువైన పఠాన్!

Published on Feb 19, 2023 8:00 pm IST

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. బాలీవుడ్ బాక్సాఫీస్ కి కావాల్సిన సిసలైన మజా అందించారు షారుఖ్ ఖాన్. ఈ చిత్రం రిలీజై ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది. శనివారం మరో 3.25 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన ఈ సినిమా, ఇప్పటి వరకూ 493.6 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. ఇదే జోరు తో 500 కోట్ల రూపాయల క్లబ్ లో ఇట్టే చేరే అవకాశం ఉంది.

ఈ చిత్రం ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని రికార్డ్ లను బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రభాస్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2 నెట్ రికార్డ్ అయిన 510 కోట్ల మార్క్ ను టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఇదే జోరు కొనసాగితే, మరో వారం లేదా 10 రోజుల్లో ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీపికా పదుకునే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో జాన్ అబ్రహం విలన్ గా నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :