అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా పఠాన్!

Published on Feb 5, 2023 3:00 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, యూఎస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రం గా పఠాన్ నిలిచింది. ఈ చిత్రం 11 రోజుల్లో 13 మిలియన్ డాలర్ల కి పైగా వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం అమీర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్ ను క్రాస్ చేయడం జరిగింది. ఈ చిత్రం యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సైతం భారీ వసూళ్లను రాబడుతోంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించిన ఈ చిత్రం లో డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విశాల్, శేఖర్ ఈ సినిమా కి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :