లేటెస్ట్ : బ్లాక్ బస్టర్ ‘పఠాన్’ వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలు

Published on Feb 7, 2023 2:01 am IST

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ పఠాన్. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సల్మాన్ ఖాన్ ఒక స్పెషల్ రోల్ చేయగా జాన్ అబ్రహం నెగటివ్ రోల్ చేసారు. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే పఠాన్ మూవీ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా భారీ కలెక్షన్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది.

ఇక ఈ మూవీ నేటితో వరల్డ్ వైడ్ గా రూ. 832 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అలానే ఈ మూవీ నేటితో ఇండియాలో రూ. 500 కోట్ల మార్క్ ని దాటేసింది. కాగా ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో పఠాన్ మంచి కలెక్షన్ రాబడుతోందని, ఈ మూవీ యొక్క క్రేజ్ చూస్తుంటే మరికొద్దిరోజుల పాటు దీని కలెక్షన్ హవా ఈ విధంగానే కొనసాగే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

సంబంధిత సమాచారం :