“పఠాన్” సెన్సేషన్..3 రోజుల్లో 300 కోట్లకి పైగా.!

“పఠాన్” సెన్సేషన్..3 రోజుల్లో 300 కోట్లకి పైగా.!

Published on Jan 28, 2023 4:00 PM IST

బాలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు సెన్సేషన్ గా వినిపిస్తున్న ఏకైక సినిమా పేరు “పఠాన్”. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తీసిన ఈ చిత్రం ఒక్క షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే కాకుండా టోటల్ బాలీవుడ్ లోనే ఓ బిగ్గెస్ట్ కం బ్యాక్ గా నిలిచింది అని చెప్పాలి. మరి వర్కింగ్ డే బుధవారం రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు మూడు రోజుల థియేట్రికల్ రన్ ని థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది.

మరి వరల్డ్ వైడ్ ఈ రోజు నాన్ స్టాప్ మైండ్ బ్లోయింగ్ వసూళ్లు నమోదు చేస్తుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ మూడు రోజులలో ఈ చిత్రం ఏకంగా 313 కోట్ల మాసివ్ గ్రాస్ ని టచ్ చేసి బాలీవుడ్ లో రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళ్తుంది. హిందీలో ఈ చిత్రానికి మూడో రోజు 38 కోట్లు వసూలు చేయగా 300 కోట్ల గ్రాసింగ్ మార్క్ అయితే బాలీవుడ్ హిస్టరీ లోనే ఫాస్టెస్ట్ రికార్డు అన్నట్టుగా బి టౌన్ ట్రాకర్స్ అంటున్నారు. మొత్తానికి పఠాన్ తో షారుఖ్ ఖాన్ దిమ్మతిరిగే కం బ్యాక్ ఇచ్చారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు