యూఎస్ లో రికార్డు మార్క్ అందుకున్న “పఠాన్”.!

Published on Feb 11, 2023 2:00 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా జాన్ అబ్రహం విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం “పఠాన్”. భారీ కం బ్యాక్ గా నిలిచిన ఈ మాస్ బ్లాస్ట్ ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మైండ్ బ్లాకింగ్ నంబర్స్ నమోదు చేసింది. అలా లేటెస్ట్ గా అయితే యూఎస్ మార్కెట్ లో ఈ సినిమా రికార్డు మార్క్ 15 మిలియన్ డాలర్స్ మార్క్ ని ఈ సినిమా అందుకుంది.

దీనితో ఇప్పుడు అక్కడ ఇండియన్ సినిమా నుంచి హైయెస్ట్ గ్రాస్ అందుకున్న ఇండియన్ సినిమాగా టాప్ 2 ప్లేస్ లో పఠాన్ నిలిచింది. మరి మొదటి స్థానంలో బాహుబలి 2 ఉంది. ఇక ఈ మాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించగా యష్ రాజ్ ఫిలిమ్స్ వారు తమ స్పై యూనివర్స్ లో భాగంగా దీనిని నిర్మాణం వహించారు. నెక్స్ట్ సల్మాన్ నుంచి రానున్న టైగర్ 3 లో షారుఖ్ క్యామియో ఉండనుంది.

సంబంధిత సమాచారం :