“ఆదిపురుష్” దగ్గరకి కూడా రాలేకపోయిన “పఠాన్” రెస్పాన్స్.!

“ఆదిపురుష్” దగ్గరకి కూడా రాలేకపోయిన “పఠాన్” రెస్పాన్స్.!

Published on Nov 3, 2022 4:00 PM IST

పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ ఉన్నటువంటి లేటెస్ట్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన అవైటెడ్ భారీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. అయితే ఇది కూడా డైరెక్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ గానే వస్తుంది కనుక దీనిపై నార్త్ లో కూడా నెక్స్ట్ లెవెల్ అంచనాలు సెట్టయ్యాయి. అయితే బాలీవుడ్ లో మన సౌత్ డామినేషన్ బాగా పెరగడంతో బాలీవుడ్ స్టార్స్ కం బ్యాక్ కోసం కూడా అంతా చాలా ఆసక్తిగా ఉన్నారు.

అయితే దానికి ఆద్యం పోసినట్టుగా మధ్యలో కొన్ని చిత్రాలు ఆశలు రేపాయి కానీ ఏవి కూడా రిలీజ్ అయ్యాక అనుకున్న రేంజ్ కి వెళ్ళలేదు. కానీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “పఠాన్” విషయంలో పరిస్థితి మాత్రం కొంచెం వేరేగా కనిపించింది. దీనితో పఠాన్ అనుకున్న కం బ్యాక్ షారుక్ నుంచి అలాగే బాలీవుడ్ నుంచి కూడా ఇస్తుంది అని బాలీవుడ్ వర్గాలు అనుకున్నాయి. మరి నిన్న రిలీజ్ చేసిన పఠాన్ టీజర్ కి కూడా సాలిడ్ టాక్ స్టార్ట్ అయ్యింది.

కానీ టీజర్ రెస్పాన్స్ మాత్రం అంత నెగిటివ్ వచ్చిన “ఆదిపురుష్” టీజర్ రెస్పాన్స్ లో సగం కూడా రాకపోవడం గమనార్హం. ఆదిపురుష్ టీజర్ కి ఒక్క హిందీలోనే 68 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా పఠాన్ కి హిందీలో కేవలం 17 మిలియన్ మాత్రమే వచ్చాయి. దీనితో అయితే ఆదిపురుష్ దరిదాపుల్లోకి కూడా పఠాన్ రాలేదని చెప్పాలి. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పఠాన్ అనుకున్న స్థాయి ఓపెనింగ్స్ సాధిస్తుంది అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు