“పఠాన్” ట్రైలర్ కూడా మరో రికార్డు.!

Published on Feb 4, 2023 8:00 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా జాన్ అబ్రహం విలన్ రోల్ లో నటించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “పఠాన్”. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్రాజెక్ట్ షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే కాకుండా బాలీవుడ్ హిస్టరీ లోనే భారీ హిట్ గా మారింది. అయితే ఈ హిట్ చిత్రం వసూళ్ల పరంగా మాత్రమే కాకుండా లేటెస్ట్ గా అయితే ట్రైలర్ తో మరో రికార్డు సాధించినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ నుంచి 100 మిలియన్ వ్యూస్ అందుకున్న ట్రైలర్ లు చాలా తక్కువ ఉన్నాయి మరి ఈ లిస్ట్ లో అయితే పఠాన్ చేరింది. మొత్తానికి అయితే పఠాన్ ఇలా కూడా సెన్సేషనల్ రికార్డులు అయితే సెట్ చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి విశాల్ మరియు శేఖర్ లు సంగీతం అందించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తమ స్పై యూనివర్స్ భాగంగా ఈ సినిమాని తీశారు. అలాగే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యామియో లో నటించాడు.

సంబంధిత సమాచారం :