పఠాన్: 8 దేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ!

పఠాన్: 8 దేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ!

Published on Dec 2, 2022 3:07 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ పఠాన్ జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. స్పెయిన్, యుఎఇ, టర్కీ, రష్యా అండ్ సైబీరియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ అనే 8 దేశాల్లో ఈ చిత్రం హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దీంతో పాటు యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన ఈ సినిమాలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు