ఓటిటి లోనూ దుమ్మురేపుతున్న ‘పఠాన్’

Published on Mar 23, 2023 1:30 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పఠాన్. సల్మాన్ ఖాన్ ఒక క్యామియో రోల్ లో కనిపించిన ఈ మూవీ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అయి రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని కొల్లగొట్టి సెన్సేషనల్ సక్సెస్ సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీ ఉగాది రోజున ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన కొద్దిసేపటి లోనే ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది పఠాన్. కాగా ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో టాప్ లో కొనసాగుతుండడం విశేషం. ఆ విధంగా అటు థియేటర్స్ లో అదరగొట్టిన పఠాన్, ఇటు ఓటిటి లో కూడా దుమ్మురేపుతుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :