అక్టోబర్ తర్వాత ఎక్కువ సమయం రాజకీయాలకే అంటున్న పవన్ !
Published on Jul 31, 2017 5:37 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించిన దగ్గర్నుంచి అటు సినిమాలకి, ఇటు రాజకీయాలకి సమయం కేటాయిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఒక్కోసారి రాజకీయపరమైన పనుల వలన ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్, విడుదలలు వాయిదాపడిన సందర్భాలున్నాయి. దీనికి తోడు ఇది వరకే త్వరలో సినిమాకి స్వస్తి పలికి పూర్తిస్థాయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లిపోతానని ప్రకటన చేసిన పవన్ తాజాగా మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేశారు.

విజయవాడలో ఏపి సచివాలయంలో ముఖ్యమంత్రితో జరిగిన భట్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటరు చేసి మాట్లాడిన ఆయన ఉద్దానం సమస్య గురించి, రాజకీయపరమైన కార్యాచరణను గురికిని చెబుతూ అక్టోబర్ తర్వాత ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తానని అన్నారు. దీన్నిబట్టి ఆయన ప్రస్తుతం సైన్ చేసి ఇంకా మొదలుకాని సినిమాలు కొంచెం నెమ్మదిగానే సాగుతాయని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook