జాతి మొత్తానికి ఇదొక్కటే పండుగన్న పవన్ కళ్యాణ్ !


స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు 71వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండవచ్చుకానీ జాతి సంబందించి ఇదొక్కటే పండగని ఆగష్టు 15 యొక్క గొప్పదనాన్ని తెలిపిన ఆయన ఈ స్వాతంత్ర్యానికి కారణమైన అమరజీవులకు నివాళులర్పిస్తూనే దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అసమానతలను గుర్తుచేశారు.

స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా దేశంలో సామాజిక, ఆర్ధిక అసమానతలు అలాగే ఉన్నాయని ఈ సాంఘిక అసమానతలు తొలగిపోయి, పేదరికం అంతమైనప్పుడే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థమని, అలాంటి రోజు కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్ గత కొన్ని రోజులుగా సినిమాలకు తక్కువ సమయం కేటాయిస్తూ రాజకీయపరమైన కార్యకలాపాల్లో ఎక్కువ నిమగ్నమవుతున్నారు.