డిసెంబర్ లో బాబాయ్ – అబ్బాయ్ ల సినిమాలు బాక్సాఫీస్ క్లాష్ కానున్నాయా ?

Published on May 24, 2023 12:38 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా ప్రాజక్ట్స్ తో బిజీ బిజీగా కొనసాగుతున్నారు. వాటిలో ఒకటి ఓజి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ మూవీ గా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఓజి పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

మరోవైపు రామ్ చరణ్ తో శంకర్ తెరకెక్కిస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడవ వారంలో రిలీజ్ చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇదే కనుక జరిగితే కేవలం వారం గ్యాప్ లో అటు బాబాయ్, ఇటు సినిమాల సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ తప్పదని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ లకు సంబంధించి ఆయా మూవీ యూనిట్స్ నుండి అఫీషియల్ గా ప్రకటనలు రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :