‘వీరమల్లు’ షూట్ కీలక డిస్కషన్ లో పవన్, దర్శక నిర్మాతలు.!

Published on Sep 7, 2021 1:58 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఎప్పుడు నుంచి మంచి అంచనాలతో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రం “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ విజువల్ అండ్ యాక్షన్ ట్రీట్ గా దీనిని అత్యున్నత ప్రమాణాలతో పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.

మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం బ్యాలన్స్ షూట్ పై మేకర్స్ పవన్ తో కలిసి చర్చించడం జరిగింది. నిన్న పవన్ మరియు హరీష్ శంకర్ ల కాంబో సినిమాపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మరియు దర్శకుడు హరీష్ శంకర్ లు కూర్చొని చర్చించగా ఈరోజు దర్శకుడు క్రిష్ మరియు వీరమల్లు చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం లు పాల్గొన్నారు.

ఎప్పుడు నుంచి మళ్ళీ షూట్ స్టార్ట్ చెయ్యాలి. సన్నివేశాలు సెట్టింగ్స్ ఇలా ఇతర కీలక సన్నాహాలపై వీరు చర్చించారని తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేశారు.

సంబంధిత సమాచారం :