పవన్ పాన్ ఇండియా మూవీ టైటిల్ తెలిసేది అప్పుడే?

pawan kalyan krish

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తరువాత మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించగా వాటిలో దర్శకుడు క్రిష్ తో ఒకటి చేస్తున్నారు. మొదటి సారి పీరియాడిక్ మూవీ చేస్తున్న పవన్ కళ్యాణ్, అదే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. మొఘలుల కాలం నాటి బందిపోటుగా పవన్ కనిపిస్తాడని సమాచారం వుంది. ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ తరువాత విరామం తీసుకోవడం జరిగింది.

కాగా ఈ మూవీ టైటిల్స్ గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, తాజాగా బందిపోటు, గజదొంగ అనే టైటిల్స్ కూడా తెరపైకి రావడం జరిగింది. ఐతే వీటిపై దర్శకుడు త్వరోనే స్పష్టత ఇస్తాడని తెలుస్తుంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ టైటిల్ ప్రకటించే అవకాశం కలదట. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

Exit mobile version