“హిట్” యూనివర్స్ లో పవన్, మహేష్..నాని ఆన్సర్ ఇదే.!

“హిట్” యూనివర్స్ లో పవన్, మహేష్..నాని ఆన్సర్ ఇదే.!

Published on Dec 2, 2022 4:05 PM IST

ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ యూనివర్స్ లు వస్తూ ఉండడం ఆడియెన్స్ కి చాలా క్రేజీ ఫీలింగ్ ని ఇస్తుంది. లేటెస్ట్ గా అయితే తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ చాలా ఎగ్జైట్మెంట్ ని అయితే ఇచ్చింది. మన టాలీవుడ్ నుంచి అయితే సినిమాటిక్ యూనివర్స్ ని యంగ్ దర్శకుడు శైలేష్ కొలను “హిట్” తో స్టార్ట్ చేసాడు.

ఇక ఈ యూనివర్స్ నుంచి లేటెస్ట్ గా రెండో సినిమా బయటకి రాగా ఈ సినిమా యూనివర్స్ ముందు రోజుల్లో మరింత గ్రాండ్ గా మారతుంది అని మేకర్స్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. అయితే లేటెస్ట్ ప్రమోషన్స్ లో ఈ సినిమా యూనివర్స్ లోకి హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు కూడా వచ్చే ఛాన్స్ ఉందా అనే ప్రశ్న సినిమా నిర్మాణ సంస్థ సమర్పకుడు నాచురల్ స్టార్ నాని అయితే స్పందించాడు.

ఈ యూనివర్స్ లో వారు నటిస్తారో లేదో వారినే అడగండి ఆంట్ సింపుల్ ఆన్సర్ అయితే ఇచ్చాడు. అంటే వారితో చేయాల్సి వచ్చినా వాయు ఒప్పుకుంటే తాను కూడా రెడీ నే అని అనుకోవచ్చు.. అయితే వారు ఎలాగో ఈ ఫ్రాంచైజ్ లోకి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి కూడా నాని ఇలా స్పందించి ఉండొచ్చని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా పడితే అందులోని ఈ తరహా యూనివర్స్ సినిమా పడితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు