పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరియు ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాలపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాల విడుదల కోసం… సదరు హీరోల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మూవీ విడుదల కానుంది. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఐతే ఈ ఇద్దరు హీరోల చిత్రాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ రెండు చిత్రాలు వారి ఇమేజ్ కి భిన్నంగా తెరకెక్కుతున్నాయి.
వకీల్ సాబ్ మూవీ పక్కా సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. ఇందులో పవన్ నుండి ఆశించే భారీ ఫైట్స్, డ్యూయట్స్,మరియు పవన్ మార్క్ కామెడీ పంచ్ లు ఉండవు. ఐతే గియితే ఓ పాట మరియు ఫైట్ ఉంటుంది. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ ఒక సెన్సిబుల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలకు కేర్ ఆఫ్ ప్రభాస్ కాగా… అవి కష్టమే అంటున్నారు. ఇక రొమాంటిక్ సాంగ్స్ ఉన్నప్పటికీ కామెడీ పాళ్ళు తక్కువే నట. కాబట్టి పవన్ మరియు ప్రభాస్ తన కొత్త చిత్రాలతో ఎంత వరకు అలరిస్తారో చూడాలి.
