“భీమ్లా నాయక్” లో పవన్ రానా ల మాస్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో..

Published on Nov 2, 2021 9:12 am IST

పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుం కోషియం చిత్రానికి రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు అనుగుణంగా ఈ చిత్రం లో కొన్ని మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, మేకింగ్ వీడియో, గ్లింప్స్ లతో పాటుగా పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. డానియల్ పాత్ర లో రానా దగ్గుపాటి మరింత పవర్ ఫుల్ పర్ఫామెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ఇద్దరూ కూడా ఈ సినిమా కోసం మరింత కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :