శరవేగంగా పవన్ – సాయి తేజ్ మూవీ షూటింగ్!

Published on Feb 28, 2023 2:00 pm IST

స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో నటుడు, దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళం లో సూపర్ హిట్ అయిన వినొదయ సీతం చిత్రానికి ఇది అధికార రీమేక్. అంతేకాక తమిళం లో డైరెక్ట్ చేసిన సముద్ర ఖని, తెలుగు లో కూడా డైరెక్ట్ చేయడం విశేషం.

ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ షురూ అయిన సంగతి అందరికీ తెలిసిందే. చిత్ర యూనిట్ విరామం లేకుండా, వేగవంతం గా షూటింగ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ సముద్ర ఖని యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు ఒక ఫోటో షేర్ చేశారు. తుఫాన్ లాంటి అప్డేట్స్ సిద్ధం గా ఉన్న విషయాన్ని వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న చిత్రం కావడం తో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :