ఫీస్ట్..పవన్ – శివ కార్తికేయన్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్న వీడియో.!

Published on Jun 24, 2022 10:00 am IST


కొంతమంది యంగ్ హీరోలకి ఎలాంటి హేటర్డ్ లేకుండా ఇతర హీరోల అభిమానులు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి హీరోలలో అయితే మన తెలుగు ఆడియెన్స్ ఆదరణ కూడా అందుకుంటున్న కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా ఒకడు. నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కూడా బాగా ఇష్టపడే ఈ హీరో రీసెంట్ గా “డాన్” సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు.

అయితే లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కలిసి ముచ్చటించడం వారి అభిమానుల్లో మంచి ఫీస్ట్ గా మారిపోయింది. నిన్న జరిగినటువంటి వివాహ వేడుకలో హాజరైన ఈ నటులు ఒకరినొకరు కలుసుకొని హాగ్ చేసుకొని కాసేపు నవ్వుతు మాట్లాడుకున్నారు. దీనితో ఈ వీడియో విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారగా ఈ ఊహించని కాంబోని చూసి అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :