‘గోపాల గోపాల’ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్

gopala_gopala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి ఈ సినిమాలో స్క్రీన్ పంచుకోనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడైన శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్.

పవన్ కలయన్ ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసాకే తన తదుపరి సినిమాపై దృష్టి సారించనున్నాడు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ దేవుడికి, దైవ భక్తికి వ్యతిరేఖంగా బిహేవ్ చేసే మిడిల్ క్లాస్ మాన్ పాత్రలో వెంకటేష్ కనిపించనున్నాడు.

వెంకటేష్ కి జోడీగా శ్రియ సరన్ నటిస్తున్న ఈ మూవీలో మధు శాలిని, దీక్ష పంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శరత్ మరార్ – డి. సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version