ఇంత పెద్ద విజయానికి కారణం ఆయనే – పవన్ సీహెచ్

Published on Sep 19, 2021 9:36 pm IST

కూల్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ ముగుస్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు.

కాగా ఈ సందర్భంగా సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ…మా సినిమా కార్యక్రమానికి అమీర్ ఖాన్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. “లవ్ స్టోరి” పాటలు ఇంత పెద్ద విజయం సాధించాయంటే అందుకు కారణం దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు థాంక్స్. కేవలం సంగీతమే కాదు శేఖర్ గారితో జర్నీ చేసిన ఈ రెండేళ్లలో మంచి మనిషిగా కూడా మారాను. ఇదొక మెమొరబుల్ జర్నీ నాకు. మా సినిమాకు మంచి సాంగ్స్ రాసిన లిరిసిస్ట్స్ అందరికీ థాంక్స్. అన్నారు.

సంబంధిత సమాచారం :