అజ్ఞాతవాసి కోసం పాట పాడిన పవన్ !

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇటివల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడ.. అనే పాటను పాడాడు. తాజాగా అజ్ఞాతవాసి సినిమాలో ”కోడక కోటేశ్వర రావు” అనే పాటను పాడడం జరిగింది.

ఈ సాంగ్ రికార్డింగ్ నిన్న పూర్తి అయ్యింది. భాస్కరబట్ల రచించిన ఈ పాటను అనిరుద్ సంగీతం అందించారు. డిసెంబర్ 31 న ఈ సాంగ్ విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో రావ్ రమేష్, మురళి శర్మ, కుష్బు, బోమైన్ ఇరాని తదితరులు నటించారు.