విశ్వనాధ్ గారి గురించి మాట్లాడే స్థాయి తనకు లేదన్న పవన్ !

26th, April 2017 - 10:48:53 AM


కళాతపశ్వి కె.విశ్వనాథ్ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు దక్కడంతో యావత్ తెలుగు పరిశ్రమ పులకించిపోతోంది. సినీ పెద్దలంతా విశ్వనాధ్ గారిని కలిసి ఆయనకు తమ అభినందనలు తెలుపుతూ తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఈరోజు ఈరోజు విశ్వనాథ్ గారిని కలుసుకుని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ విశ్వనాథ్ గారిలాంటి గొప్పవారి గురించి మాట్లాడే అర్హత, స్థాయి, అనుభవం, వయసు తనకి లేవని అందుకే తన అందాన్ని తెలపడానికి ఆయన్ను కలిశామని, ఆయన సినిమాల్లో స్వాతిముత్యం, స్వయం కృషి, శంకరాభరణం, శుభలేఖ సినిమాలంటే తనకెంతో ఇష్టమని అన్నారు. అలాగే త్రివిక్రమ్ మాట్లాడుతూ విశ్వనాథ్ గారు తీసిన గొప్ప సినిమాల్లో 12 సినిమాల్ని కలిపి ఒక డిస్క్ సెట్ గా చేసి రిలీజ్ చేయాలని పవన్ అన్నారని, ఆ ఆలోచన తనకు కూడా నచ్చిందని, ఆ కార్యం ఈ సంవత్సరంలోనే చేస్తామని, ఆయనకు దాదా సాహెబ్ అవార్డు రావడం అవార్డుల మీదున్న నమ్మకాన్ని పెంచిందని అన్నారు.