సర్జరీ వద్దనుకున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండగానే వెన్నునొప్పితో ఇబ్బందిపద్దారు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాతా అధికమైన శారీరక శ్రమకు గురికావడంతో ఆ వెన్నునొప్పి మరింత తీవ్రమైంది. దీంతో ఆయన వైద్యులను సంప్రదించగా వెంటనే సర్జరీ చేయించుకుంటే సమస్య తీవ్రతరం కాదని సలహా ఇచ్చారట.

దీంతో ఆలోచనలో పడిన పవన్ వెన్ను సమస్య కావడంతో సర్జరీ చేయించుకోవడం కంటే ప్రకృతి వైద్యమే మేలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ట్రీట్మెంట్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ చికిత్సకు ఎక్కువ సమయమే పడుతుంది కాబట్టి కొన్నిరోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది.

Exit mobile version