పవన్ ఫ్యాన్ డైరెక్టర్ లాంచ్ చేయనున్న ‘పవర్ స్ట్రామ్’.!

Published on Aug 14, 2021 7:53 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న కొన్ని క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా ఒకటి. మళయాళ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి రేపు అదిరే అప్డేట్ ని మేకర్స్ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

పవర్ స్ట్రామ్ పేరిట రేపు ఉదయం ఈ మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం టైటిల్ మరియు గ్లింప్స్ ని రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చెయ్యగా ఇప్పుడు దానిని ఎవరు లాంచ్ చేస్తున్నారో చెప్పారు. మరి దానిని పవన్ కి క్రేజీ ఫ్యాన్ అయినటువంటి స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చెయ్యనున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. మరి ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :