వైరల్ : ఈ రీమేక్ పై ఇండియా వైడ్ పవన్ ఫ్యాన్స్ యుద్ధం..!

వైరల్ : ఈ రీమేక్ పై ఇండియా వైడ్ పవన్ ఫ్యాన్స్ యుద్ధం..!

Published on Dec 8, 2022 4:28 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓ స్ట్రైట్ సినిమా యంగ్ దర్శకుడు సుజీత్ తో అనౌన్స్ చేసి ఆ యుఫోరియా నుంచి ఇంకా బయటకి రాకుండానే పవన్ నుంచి మరో రీమేక్ రాబోతుంది అనే వార్త ఇప్పుడు అభిమానులు బాగా డిజప్పాయింట్ చేసేసినట్టు ఉందని చెప్పాలి. అయితే పవన్ కి ఇప్పుడున్న సమయంలో రెండు కొత్త సినిమాలు చేయనున్నాడని కొన్ని రోజులు కితమే టాక్ రాగా అందులో సుజీత్ తో ప్రాజెక్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు.

ఇక ఈరోజు దర్శకుడు హరీష్ శంకర్ అయితే తమ కాంబోలో సినిమాపై అప్డేట్ ఇవ్వడం.. ఆ నెక్స్ట్ ఈ చిత్రం తమిళ హిట్ చిత్రం “తేరి” కి రీమేక్ అని గట్టి టాక్ సినీ వర్గాల నుంచి రావడం చకచకా జరిగిపోయాయి. దీనితో ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయ్యి పైగా చాలా మందికి తీసిన సినిమాని మళ్ళీ రీమేక్ చెయ్యడం ఏంటి అని పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు.

దీనితో ఇక ట్విట్టర్ లో యుద్ధం మొదలు పెట్టారు. “వి డోంట్ వాంట్ తేరి రీమేక్” అంటూ స్టార్ట్ చేసిన ట్రెండ్ ఇప్పుడు ఇండియా వైడ్ వైరల్ గా మారింది. మరి ఇది ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. ఖచ్చితంగా అయితే పవన్ ఫ్యాన్స్ ఈ ఒక్క రీమేక్ విషయంలో సుముఖంగా లేరు అనేది క్లియర్ గా ఇప్పుడు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు