శివ బాలాజీకి మర్చిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !

15th, October 2016 - 03:14:07 PM

katamrayudu-6

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’లో పవన్ తమ్ముళ్లలో ఒకరిగా నటిస్తున్నాడు శివ బాలాజీ. నిన్న ఆయన తన పుట్టినరోజును కాత్తమరాయడు సెట్స్ లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ ఈ సెలబ్రేషన్ ను స్వయంగా పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా నిర్వహించారు. దీంతో శివ బాలాజీ భావోద్వేగంతో పట్టరాని సంతోషానికి గురయ్యాడు. అణా ఆనందాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

నిన్న తాను సెట్స్ లో కూర్చొనుంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారని అప్పుడు తాను లేచి గుడ్ మార్కింగ్ సర్ అని విష్ చేయగా డైరెక్టర్ డాలి వచ్చి పవన్ తో ఈరోజు బాలాజీ పుట్టినరోజు సర్ అని చెప్పడంతో పవన్ వెంటనే ప్రొడక్షన్ వారిని పిలిచి పెద్ద కేక్ తెప్పించి బాలాజీ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రే చేశారట. అంతేగాక బాలాజీ తన భార్య మధుని కూడా పిలవచ్చా సర్ అని అడగ్గా అదేమిటయ్యా పిల్లల్ని, ఇంట్లో అందర్నీ పిలువు అన్నారట. దీంతో భావోద్వేగానికి గురైన బాలాజీ పవన్ చూపించిన ఆ ఆదరణ విలువ కట్టలేనిదని, ఆ మధురానుభూతిని ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పాడు.