అల్లు అర్జున్ సరసన పవన్ హీరోయిన్ ?


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన నూతన చిత్రం ‘నా పేరు సూర్య’ ను మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ రచయిత అయిన వక్కంతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. కథ దగ్గర్నుండి హీరో క్యారెక్టరైజేషన్ వరకు అన్నింటిలోను కొత్తదనమున్న ఈ చిత్రంలో హీరోయిన్ కూడా కొత్తగానే ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

అందుకే తెలుగు ప్రేక్షకులకు కొద్దిగా మాత్రమే పరిచయమున్న హీరోయిన్ ను తీసుకోవాలనే ఉదేశ్యంతో అను ఇమ్మాన్యుయేల్ పేరును పరిశీలిస్తున్నారని సినీ సర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ఆమెను ఎంత వరకు వరిస్తుందో చూడాలి. ‘మజ్ను’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ ఆ తర్వాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంలో నటించి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ప్రాజెక్టులో కూడా చేస్తోంది. ఇకపొతే బన్నీ నూతన చిత్రం ‘దువ్వడా జగన్నాథం’ రేపు శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ కానుంది.