ఒకే రోజు రెండు సినిమాలతో రానున్న పవన్ హీరోయిన్ !

‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అను ఇమ్మానుల్ ఆ తరువాత ‘కిట్టుఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో నటించింది, ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగులో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమాతో పాటుఅల్లు అర్జున్ సినిమా లో నటిస్తుంది, మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటించబోతున్న ఈ హీరోయిన్ తాజాగా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం.

గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆక్సిజన్’. ఈ సినిమా గతంలో పలుసార్లు వాయిదా పది చివరికి నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది, అలాగే విశాల్ సరసన అను నటించిన ‘డిక్టేటర్’ సినిమా కూడా అదేరోజు విడుదల కాబోతుండడం విశేషం. తక్కువ కాలంలో పెద్ద సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుందాం.