టాక్..పవన్ ఆ సినిమాకి నిర్మాత మాత్రమేనా.?

Published on Feb 4, 2022 7:15 am IST

మన తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాను స్క్రీన్ పై కనిపిస్తే చాలు రికార్డులు బడ్డలవుతాయి. మరి అలాంటి పవన్ ఇప్పుడు తన క్రేజ్ కి తగ్గ సినిమాలనే కొన్ని చేస్తున్నారు. అయితే పవన్ తాను సినిమాలు నటించటంతో పాటు మాత్రమే కాకుండా సినిమాలు కూడా నిర్మాణం వహించడానికి సిద్ధం అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. తన ప్రొడక్షన్ బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేలా పవన్ పూనుకున్నారు.

మరి ఈ బ్యానర్ లోనే గత కొన్నాళ్ల కితం ఒక సినిమా రీమేక్ కి సంబంధించి టాక్ బయటకు వచ్చింది. తమిళ్ స్టార్ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేసిన వినోదయ సైతం అనే సినిమా డైరెక్ట్ ఓటీటీ లో వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. మరి ఈ సినిమాని పవన్ నిర్మిస్తాడని ఇందులో నటిస్తాడని కూడా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో కనిపిస్తాడట. అయితే అతడితో పాటు పవన్ కూడా కనిపిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నా ఈ సినిమాకి అతడు కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటాడని తెలుస్తోంది. ఇప్పుడుకే అనేక రీమేక్స్ తో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇక మరో రీమేక్ అంటే మరింత నిరాశ చెందడం గ్యారెంటీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :