సూపర్ స్టైలిష్ గా తన నెక్స్ట్ మూవీ పూజా కార్యక్రమానికి విచ్చేసిన పవన్!

Published on Jan 30, 2023 10:43 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో దర్శకుడు సుజీత్ తొలిసారిగా పేరు పెట్టని సినిమా కోసం కలిసి నటిస్తున్నారనే వార్త అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించనున్నారు మేకర్స్. ఈ పూజా కార్యక్రమం కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ గా విచ్చేశారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేశాడు అంటూ మేకర్స్ హ్యష్ ట్యాగ్ తో ఒక విడియో ను పోస్ట్ చేశారు.

మేకర్స్ ఇప్పటి వరకు నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. ఈ ప్రాజెక్ట్‌ను డివివి దానయ్య తన హోమ్ బ్యానర్ డివివి ఎంటర్టైన్‌మెంట్‌పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. షూటింగ్ మరియు ఇతర వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. వీరి కాంబినషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :