“వీరమల్లు” షూటింగ్ లో పాల్గొన్న పవన్

“వీరమల్లు” షూటింగ్ లో పాల్గొన్న పవన్

Published on Oct 26, 2022 3:45 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం హరి హర వీరమల్లు షూటింగ్ అక్టోబర్ నెలలో పునః ప్రారంభించనున్నట్లు గతంలో వెల్లడించడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం, రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.

ఈరోజు షూటింగ్‌లో పాల్గొన్న పవన్ పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు