అంతే హై తో పవన్, హరీష్ ల చిత్రం ప్రీ లుక్ పోస్టర్!

Published on Sep 2, 2021 4:27 pm IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న వాటిలో దర్శకుడు హరీష్ శంకర్ తో అనౌన్స్ చేసిన 28వ సినిమా కూడా ఒకటి. గత ఏడాది ఇదే రోజున పవన్ బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసిన ఈ చిత్రం, మళ్ళీ ఈ ఏడాది స్పెషల్ అప్డేట్ ని ఇచ్చింది. ప్రీ లుక్ పోస్టర్ ని వదులుతున్నామని కన్ఫర్మ్ చేసిన మేకర్స్ ఇప్పుడు దానిని కూడా లాంచ్ చేశారు.

మరి గత ఏడాది జస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ లా ప్లాన్ చేసి రిలీజ్ చేసిన దానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు రిలీజ్ చేసింది కూడా అంతే హై లో ఉందని చెప్పాలి. హార్లే డేవిడ్ సన్ బైక్ పై ఒక మైక్ పట్టుకొని ఏదో అనౌన్స్మెంట్ కి సిద్ధంగా ఉన్న పవన్ అన్నట్టుగా ఇది ఉంది.

పైగా లాస్ట్ టైం చూపించినట్టుగా ఢిల్లీ గేట్ కూడా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. అలాగే ‘మళ్ళీ ఫుల్లీ లోడింగ్’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. మొత్తానికి మాత్రం ఈ ప్రీ లుక్ మంచి ప్రామిసింగ్ గా అంతే హై లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :