“సత్యాగ్రహి” సినిమా పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

“సత్యాగ్రహి” సినిమా పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

Published on Oct 11, 2021 2:00 PM IST

పవన్ కళ్యాణ్ హీరోగా సత్యాగ్రహి చిత్రం గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ చిత్రం పై పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పందించడం జరిగింది.

లోక్ నాయక్ “జయ ప్రకాష్ నారాయణ్” సమకాలీన కాలం లో ఎమర్జెన్సీ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన రాజకీయ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. 2003 లో ప్రారంభం అయింది అనుకుంటా అని అన్నారు. అయితే సినిమా లో నటించడం కంటే నిజ జీవితం లో అందుకోసం నడవడం మరింత సంతృప్తి ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు