నాలుగు సినిమాల్ని రిలీజ్ చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ !

pawan
‘సర్దార్ గబ్బర్ సింగ్’ పరాజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2017 ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తరువాత పవన్ తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిత్రాన్ని మొదలుపెడతాడట. అలాగే 2019 ఎన్నికలలోపు కనీసం నాలుగు చిత్రాలను రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికలు మొదలయ్యే సమయానికి పూర్తిగా రాజకీయపరమైన పనుల్లో బిజీ అయిపోతారు. కాబట్టి ఆయన అనుకున్న నాలుగు సినిమాలు 2018 చివరకు పూర్తయ్యేలా కనిపిస్తున్నాయి. అంటే 2017 లో రెండు, 2018 లో మరో చిత్రాలను రిలీజ్ చేసే అవకాశముంది. ఇకపోతే డాలి డైరెక్ట్ చేస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిసున్నాడు.