పవన్-బండ్ల కాంబోపై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

Published on Aug 3, 2021 2:03 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ మరో సినిమా చేస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో గబ్బర్‌సింగ్, తీన్‌మార్ సినిమాలు రాగా గబ్బర్‌సింగ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే కొత్త సినిమా ప్రకటించి చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది.

అయితే పవన్‌తో చేసే సినిమా కోసం బండ్ల గ‌ణేశ్ ఓ క‌థ‌ను వినగా అది అతడికి పెద్దగా నచ్చలేదని, ప్రస్తుతం ఆయన ఓ మంచి కథను ఎంచుకునే పనుల్లో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే యువ ర‌చ‌యిత‌ల‌ను కూడా ఆయన సంప్ర‌దిస్తున్నారని తెలుస్తుంది. ఇదే కాకుండా ఈ మూవీనీ హ్యాండీల్ చేయగల దర్శకుడినివెతికే పనిలో కూడా బండ్ల గణేశ్ నిమగ్నమైనట్టు తెలుస్తుంది. అయితే మంచి కథ, దర్శకుడు ఒకే అయితే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :