పవన్ – హరీష్ శంకర్ సినిమా పై పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్ కి సిద్దం!

Published on Sep 8, 2021 4:26 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. ఇప్పటికే అయ్యప్పనుం కోషియం చిత్రం రీమేక్ అయిన భీమ్లా నాయక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఆగిపోయిన హారి హర వీరమల్లు చిత్రం లో నటించనున్నారు. అదే విధంగా డైరక్టర్ హరీష్ శంకర్ తో మరొక చిత్రం చేస్తున్నారు.

పై అన్ని సినిమాల్లో అభిమానుల్లో ఎక్కువగా అంచనాలు పెట్టుకుంది హరీష్ శంకర్ దర్శకత్వం లో వస్తున్న సినిమా పై అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి గతం లో గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడం తో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ప్రి లుక్ ను విడుదల చేయడం జరిగింది.

తాజాగా ఈ చిత్రం నుండి మరొక పవర్ ప్యాక్డ్ అప్డేట్ సిద్దమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించడం జరిగింది. మరొక లెవెల్ సెలబ్రేషన్స్ కోసం రెడీ గా ఉండండి అంటూ టీమ్ వెల్లడించడం జరిగింది. అంతేకాక పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. రేపు ఉదయం 9:45 గంటలకు ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :