గ్రేట్ డెసిషన్ : నిన్న మహేష్ ఫ్యాన్స్, నేడు పవన్ ఫ్యాన్స్

Published on Aug 30, 2022 12:17 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన 51వ జన్మదినం జరుపుకోనున్న సందర్భంగా ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన ఫ్యాన్స్ పలు సామజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు పవన్ నటించిన హిట్ మూవీస్ అయిన తమ్ముడు, జల్సా మూవీస్ స్పెషల్ షోస్ ని సెప్టెంబర్ 1న సెలక్ట్ చేసిన పలు ప్రాంతాల్లో ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించనున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మూవీస్ యొక్క స్పెషల్ షోస్ కలెక్షన్ నుండి వచ్చిన డబ్బుని చారిటీ కోసం వినియోగించేందుకు సిద్ధం అయ్యారు పవన్ ఫ్యాన్స్. ఇక ఇటీవల ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించిన పోకిరి మూవీ కలెక్షన్ డబ్బుని ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు ఫౌండేషన్ కి విరాళంగా అందించారు. ఈ విధంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్, పవన్ ఇద్దరి అభిమానులు స్పెషల్ షోస్ డబ్బులని మంచి పనులకు వినియోగించడం ఎంతైనా అభినందనీయం అంటున్నారు సినీ ప్రముఖులు, విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :