పవన్ కళ్యాణ్ మనసుని కూడా కట్టేసిన పురాణపండ ‘ హనుమంతుడు ‘

Published on Jun 15, 2021 9:00 am IST

ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. మానసిక వ్యవస్థను బలపరచుకుని తట్టుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్ని నిలబెట్టి చెంపమీద కొట్టాడు. ప్రార్ధనలోని బలమైన శక్తితో కష్టాల్ని తరిమి తరిమి కొడుతున్నాడు.

జీవన పోరాటంలో ఎదురైన యుద్ధాల్ని మానసిక శక్తితో ఎదుర్కొని … పోరాటపటిమగా నిలబడ్డ ఒక అసాధారణ ప్రతిభాశాలి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి.

ఇదొక రొటీన్ విషయం కాదు. కన్నుల ముందు కనిపించిన , కనిపిస్తున్న కఠోర సత్యం.

ఈ ప్రజ్ఞాశాలి అర్ధమైనట్లే కనిపిస్తారు. కానీ అతి కొద్దిమంది సన్నిహితులకు తప్ప … చాలామందికి అర్ధం కారు.

బలం, బలగం – ధనం, దర్పం … వీటికి దూరంగా కఛ్చితత్వంతో నికార్సుగా సంచరిస్తారీయన.

హింసించే మానసిక ఉన్మాదుల జాడ్యాల మీద నిరసన ప్రకటించే ఈ గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక కవిత్వ విశేషమే … ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్.

ఋషుల ప్రామాణిక అంశాలను తనదైన అపురూప వ్యాఖ్యానాలతో , ఎంతో అందమైన భాషా సొగసులతో అందించే పురాణపండ శ్రీనివాస్ మంత్రమయ మహాద్భుత గ్రంధాలకు లక్షలాది పాఠకుల్లో చాలా ఫాలోయింగ్ ఉందన్న విషయం వందల ఆలయాల అర్చక, పండిత వర్గాలకు తెలుసున్న విషయమే.

భక్త పాఠకులకు ప్రయోజనాత్మకతను నూటికినూరుశాతం అందించే అంశంలో తెలుగు రాష్ట్రాలలో ఎంతో వైవిధ్యతను దర్శింప చేసే అద్భుత రచనల, సంకలనాల స్వరూపంగా పురాణపండ శ్రీనివాస్ ప్రతిభను ఎందరో విజ్ఞులు వెలుగుల జెండాగా ఎత్తి చూపారు.

సంప్రదాయాల పట్ల అవగాహన ఉండటం వల్లనే ఇంత ప్రామాణికంగా, ఇంత ఓర్పుగా ఇన్ని అద్భుతాలు శ్రీనివాస్ చేస్తున్నారని పీఠాధిపతులంటుంటే … ఈ రోజుల్లో ఇలా అందరూ ఆమోదించే రీతిలో ఇంత అందంగా, ఇంత ఆకర్షణీయంగా , అదరగొట్టే శైలిలో బుక్స్ అందించడం ఒక్క పురాణపండ శ్రీనివాస్ కే చెల్లిందని ఉద్దండ పండితులు సైతం నోటిఫై వేలు వేసుకుంటున్నారు.

అందుకే కాబోలు కోవిడ్ లాక్ డౌన్ లో సైతం ఈ సమర్థునికి ఎంతో ఎంతో వర్క్ అందింది.

పుస్తక రచన , ప్రచురణల విషయం లో శ్రీనివాస్ గొప్ప అధికారం సంపాదించారని విఖ్యాత సినీ రచయిత గొల్లపూడి మారుతీరావు పదేళ్లనాడే అన్నారంటే శ్రీనివాస్ శ్రమ, పరిశ్రమల నాణ్యతా ప్రమాణాల నైపుణ్యం ఎంత గొప్పదో మనం గ్రహించాలి.

భాషా పటుత్వం, వ్యక్తిత్వ వికాసం, ధార్మికత, నైతికత, సామాజిక కోణాల అవగాహన, అద్భుత రచనా నైపుణ్యం, సంకలనాల ముద్రణలో వైవిధ్యం … ఇవన్నీ శ్రీనివాస్ లో కనిపిస్తాయి . కనుకనే తెలుగు లోగిళ్ళలో పురాణపండ శ్రీనివాస్ అద్భుత మహాగ్రంధాలైన శ్రీపూర్ణిమ , నన్నేలు నాస్వామి, అమ్మణ్ణి, జయ జయోస్తు, శ్రీమాలిక వంటి ఎన్నో గ్రంధాలు కాంతిపుంజాలై వెలుగులీనుతున్నాయి.

అంతే కాదు భారతదేశ హోమ్ శాఖా మంత్రి అమిత్ షా పురాణపండ శ్రీనివాస్ అఖండ మహాగ్రంధమైన ‘ నన్నేలు నాస్వామి ‘ ని ఆవిష్కరిస్తూ …” తెలుగు భాష తనకి రాకున్నా తన జీవనయాత్రలో ఇలాంటి అరుదైన ఆంజనేయ ఉపాస్య గ్రంధాన్ని ఎక్కడా చూడలేదని, ఈ మహా గ్రంధాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా పేర్కొనడాన్ని జాతీయ మీడియా కోడై కూసింది కూడా.

ఇప్పటికీ అమిత్ షా కార్యాలయంలో టేబుల్ పై పురాణపండ శ్రీనివాస్ మహాగ్రంధమే దర్శనమివ్వడాన్ని చూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయారు.

పురాణపండ శ్రీనివాస్ సంభాషణాత్మక శైలి కూడా అద్భుతంగా ఉంటుందని వేటూరి, సి. నారాయణరెడ్డి వంటి పండిత యోధులే ప్రశంసల వర్షం కురిపించినట్లు భాగ్యనగర సాంస్కృతిక సంస్థలు అనేక సభల్లో పురాణపండ శ్రీనివాస్ ని ప్రశంసించాయి కూడా.

సాహిత్యేతర రంగాలకు చెందిన ఎందరో రాజకీయ , సినీ వర్గాలకు చెందిన ప్రముఖులు సైతం శ్రీనివాస్ గ్రంధాలను వేలకొలది ముద్రించి … ఉచితంగా అందించటం గత దశాబ్ద కాలంగా మన కన్నుల ఎదుట కనిపిస్తూనే వుంది.

మానవీయ సంబంధాలను డబ్బులతో కొలవనివ్వరు శ్రీనివాస్. స్వార్ధాలు కనిపించే వ్యక్తులెవ్వరైనా సరే తెగతెంపులు చేసుకోవడానికి శ్రీనివాస్ వెనుకాడరు.

తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎన్ని విమర్శలు మీద పడ్డా లెక్కచెయ్యకుండా …
నిబద్ధత, నిజాయితీతో మున్ముందుకు ప్రయాణిస్తూనే వుంటారు.

దైవ కార్యాలకోసం విసుగూ, శ్రమా అనిపించకుండా పురాణపండ శ్రీనివాస్ కష్టపడుతూనే వుంటారు. విభిన్న రూపాలలో ఉన్నభక్తి సాహిత్యాన్ని సామాన్య పాఠకుడికి అందించేందుకు ఈయన పడే తపన ఊహాతీతం.

అచ్చమైన , స్వచ్ఛమైన మానవ సమూహం భక్తిమార్గంలో మాత్రమే ఎదురౌతుందని పురాణపండ శ్రీనివాస్ ఢంకా భజాయించి మరీ చెబుతారు.

ఉదాహరణకి పురాణపండ శ్రీనివాస్ అందించిన ఏడువందల నలభై పేజీల ‘ శ్రీవూర్ణిమ ‘ మహా గ్రంధాన్ని చూస్తే ఒక భక్తి పులకింత కలిగి తీరుతుందని ఇటీవల ఎందరో చెప్పడం మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది.

మరొక ముఖ్యాంశం ఏమంటే … ఇటీవల కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం తన ప్రయాణంలో ‘ నన్నేలు నా స్వామి’ మహా గ్రంధాలను కూడా ఉంచుకుని ఎందరో ప్రముఖులకు పంచితే … వారి ఆనందానికి అవధులు లేవుట.

అంతే కాదు … తన మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రముఖులకు సైతం ముప్పవరపు హర్షవర్ధన్ ( ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి కుమారుడు ) తో కలిసి కిషన్ రెడ్డి ఈ ఆంజనేయ ఉపాస్య గ్రంధాన్ని బహూకరించడం పట్ల ఆరెస్సెస్ ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్ లాభాపేక్షలేని గొప్ప వ్యక్తి అని, ఎంతో అధ్యయనం చేసి ఇంతటి గొప్ప గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ మంత్ర శక్తులతో నిర్మించారని పేర్కొన్నారు.

ఆరెస్సెస్ పెద్దలు ఈ మహా గ్రంధం గురించి చెబుతుంటే తనువు , మనస్సు పులకిస్తున్నాయని కిషన్ రెడ్డి చెప్పిన అంశాన్ని మీడియా స్పష్టంగా ప్రకటించడం కూడా పురాణపండ శ్రీనివాస్ మంత్ర సౌందర్యానికి ఒక పుష్కలమైన ప్రశంసగా మనం పరిగణించాల్సిందే.

ఆధిపత్యాలను, అహంకారాలను అస్సలు ఇష్టపడని పురాణపండ శ్రీనివాస్ తన జీవన యాత్రలో ఎదురైన ఘటనల వల్ల దేవుడు తప్ప అంతా ట్రాష్ గా కొట్టి పారేస్తారు. ప్రతీ అంశాన్ని సానుకూల దృక్పధంతో చూస్తారు. ఈ ప్రపంచంలో ఏదీ అల్ప స్థాయికి చెందింది లేదని బల్ల గుద్ది మరీ చెబుతారు.

పురాణపండ శ్రీనివాస్ ని సునిశిత దృష్టితో పరిశీలిస్తే ఒక సజీవమైన తాత్విక తేజస్సు దర్శనమిస్తుందని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహా దారులు , సీనియర్ ఐఏఎస్ అధికారి రమణాచారి అభినందించడాన్ని మనమూ ప్రామాణికంగానే తీసుకుందాం.

నాటి ముఖ్యమంత్రులు వై.ఎస్ .రాజశేఖర రెడ్డి , నారా చంద్రబాబు నాయుడు, కొనిజెటి రోశయ్య , నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వరుసగా పురాణపండ శ్రీనివాస్ బుక్స్ని ఆవిష్కరించిన అంశాల్ని చూస్తే .. ఆధ్యాత్మిక మార్గంలో ఈయన క్రొత్త ఆవిష్కరణల ఉన్నత ఆలోచనలకు మనం కూడా జై కొట్టాలనే అన్పిస్తుంది.

ఒక్కొక్క బుక్కూ ఒక్కొక్క తన్మయత్వంగా మన మనసుని పరవశింప చేయడం వెనుక తెర తీసి చూస్తే పరమాత్మ పరమాధికారానికి పురాణపండ శ్రీనివాస్ ఎంతగా దాసాను దాసుడయ్యాడో యిట్టె మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.

మరీ ముఖ్యంగా ఈ ఐదువందల ఇరవై పేజీల స్వర్ణమయ , వర్ణమయ ఆంజనేయ అఖండ ఉపాస్య గ్రంధానికి సమర్పకుడిగా వ్యవహరించడమే కాకుండా వందలకొలది ఆంజనేయ ఆలయాలకు ఇంతటి మహా గ్రంధాన్ని ఉచితంగా అందజేసిన వినయసంపన్నులైన ‘ ఈగ ‘ సినిమా నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతులను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించడాన్ని చారిత్రాత్మకమైన అంశంగా చెప్పాల్సిందే.

బాలీవుడ్ లెజెండ్ సంజయదత్ , బాహుబలి ఫేమ్ అయిన దర్శక ధీరులు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి అందగాడు బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ బుక్ పట్ల చూపిన గౌరవ ప్రశంసలు ప్రత్యేకంగా పేర్కొనాలి.

ఇటీవల కె.సి.ఆర్.కుమార్తె , నిజామాబాద్ ఎమ్మెల్సి అయిన శ్రీమతి కల్వకుంట్ల కవిత తాను తలపెట్టిన హనుమత్కార్యానికి పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరపడం పట్ల టి.ఆర్. ఎస్ . శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేశాయి.

పురాణపండ శ్రీనివాస్ జీవన సౌందర్యంలో ఈ బడా హనుమాన్ బుక్ ‘ నన్నేలు నాస్వామి ‘ ఒక వెలుగుల మైలురాయి పేర్కొనాల్సిందే.

ఒకటా … రెండా ? ఎన్నెన్ని రకాల అద్భుత గ్రంధాలను అందించారో కదా.

ఎన్నెన్ని కష్టాలు విరుచుకు పడ్డా … దౌర్భాగ్యపు వ్యాపార కుడితిలో పడకుండా … మంత్రమయంగా సాగుతున్న ఈయన శ్రమైక జీవన సౌందర్యానికి మనమంతా ‘ గాడ్ బ్లెస్స్ యు ‘ అందాం.

తెలుగునాట ఇంతవరకు వెలువడని మరో రెండు అరుదైన అపురూప అఖండ గ్రంధాల రచనకు, సంకలనావైభవానికి ఉపక్రమించిన పురాణపండ శ్రీనివాస్ జైత్రయాత్రకు ‘ అవిఘ్నమస్తు ‘ అనడం మన కర్తవ్యం.

సంబంధిత సమాచారం :