ఆచార్య : ‘సిద్ధ’ పాత్రలో పవన్ కళ్యాణ్..చిరు క్రేజీ స్టేట్మెంట్.!

Published on Apr 26, 2022 3:41 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మాస్ అండ్ మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య” కోసం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన సాలిడ్ మల్టీ స్టారర్ భారీ అంచనాలు నెలకొల్పుకొని ఇప్పుడు విడుదలకి రెడీ అయ్యింది.

అయితే లేటెస్ట్ గా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా ఈ ప్రమోషన్స్ లో మెగాస్టార్ చేసిన ఒక లేటెస్ట్ అండ్ క్రేజీ స్టేట్మెంట్ మెగా ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇస్తుంది. తాను మాట్లాడుతూ ఈ సినిమాలో సిద్ధ పాత్రకి ఒకవేళ రామ్ చరణ్ అందుబాటులో లేకపోతే ఆ పాత్రకి పవన్ కళ్యాణ్ అయితే సరిగ్గా సరిపోతాడని తన వ్యూ తెలిపారు.

దీనితో ఒకవేళ ఇది గాని జరిగి ఉంటే ఈ సినిమాకి వేరే లెవెల్లో ఉండేది అని పవన్ అభిమానులు మరియు మెగా అభిమానులు అనుకుంటున్నారు. అలాగే కొందరు అయితే ఆల్రెడీ ఆ మెగా విజువల్స్ ని కూడా ఊహించేసుకుంటున్నారు. ఇక ఈ భారీ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :