“అంటే సుందరానికీ” ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా పవర్ స్టార్..!

Published on Jun 8, 2022 12:00 am IST

న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “అంటే సుందరానికీ”. నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కూడా సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని మరింత పెంచేసింది. జూన్ 9న జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులందరికీ బిగ్‌సర్ర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

సంబంధిత సమాచారం :