ఒకే ఫ్రేమ్ లో పవన్, రేణు దేశాయ్.. పిక్స్ వైరల్..!

Published on May 24, 2022 2:25 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణుదేశాయ్ చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. పవన్ రేణుదేశాయ్ దంపతుల తనయుడు అకీరానందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఈ అరుదైన ఘనత చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలులో అకీరా గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది.

అకీరా కోసం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కి వచ్చి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగాడు. పవన్, రేణుదేశాయ్ భార్యభర్తలుగా విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరి పిల్లల కోసం అప్పుడప్పుడు తమ పట్టింపులను పక్కన పెట్టి కలుసుకుంటున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత పవన్, రేణుదేశాయ్, వాళ్లిద్దరి పిల్లలు ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత సమాచారం :