మరోసారి తండ్రైన పవన్ కళ్యాణ్ !

రేణు దేశాయ్ నుండి విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత పవన్ అన్నా లేజ్హ్నేవను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా ఇప్పుడు మరొక బిడ్డ కూడా జన్మించింది. ఈసారి పవన్ కు కుమారుడు కలిగినట్టు సమాచారం. ఈరోజు ఉదయమే అన్నా లేజ్హ్నేవ బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రస్తుతం తల్లి, కుమారుడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. తమ అభిమాన నటుడు, నేత తండ్రవడంతో పవన్ అభిమానుల్లో కోలాహలం నెలకొంది. సోషల్ మీడియా ద్వారా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే పవన్, రేణు దేశాయ్ లకు ఇదివరకే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే.