దసరాకి పట్టాలెక్కబోతున్న ‘భవదీయుడు భగత్ సింగ్’?

Published on Sep 28, 2021 1:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసి రిలీజ్ చేసిన పోస్టర్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే వీరి కాంబోలో వచ్చిన “గబ్బర్ సింగ్” సంచలన విజయాన్ని సాధించడంతో ఈ సినిమాపై కూడా అలాంటి అంచనాలే ఉండడంతో ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ‘విజయదశమి’ రోజున అంటే అక్టోబర్ 15వ తేదీన లాంఛనంగా మొదలుకానుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్దే నటిస్తుందా లేదా అనేది కూడా అదే రోజున తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరీ తొందరలో మేకర్స్ దీనిపై ఏమైనా అప్డేట్ లాంటిది ఇస్తారన్నది.

సంబంధిత సమాచారం :