యూత్ ఇకనైనా మేల్కోవాలని పిలుపునిచ్చిన పవన్

pavan-kalyan

ఫిల్మ్ స్టార్ గా తనకి ఊహించలేని క్రేజ్, తను రాజకేయాల్లోకి రాగానే ఆ క్రేజ్ మరింత ఎక్కువైంది, అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హీరో నుంచి పొలిటీషియన్ గా మారిన పవన్ కళ్యాణ్ యువత ఇప్పటికైనా మేల్కొని సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. నిన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీ కాకుళం రాజంలోని జిఎంఆర్ కేర్ హాస్పిటల్స్ మరియు ఇన్స్టిట్యూట్స్ ని విజిట్ చేసాడు. అక్కడ జరిగిన సభకి భారీ సంఖ్యలో స్టూడెంట్స్, టీచర్స్, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

పవన్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్క స్టూడెంట్ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఒకసారి మన స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తు చేస్కొండి. యువత అంతా మీ కాళ్ళ ముందు ఏదన్నా తప్పు జరిగితే ప్రశ్నించే విధానాన్ని అలరించారు. అలాగే ఎవరైతే మహిళలని ఇబ్బంది పడేలా హెరాస్ చేస్తారో వాళ్ళని చెప్పుతో కొట్టాలి. మనం అంతా కలిసి మహిళలకి సపోర్ట్ ఇస్తేనే వాళ్ళకి ఈ సమాజంలో రక్షణ ఉంటుంది. అలాగే మాట్లాడుతూ మన రాష్ట్రం విడిపోవడానికి గల కారణం కూడా మన ముందు తరాల వారు చేసిన తప్పులే కారణం అని ఆయన’ అన్నాడు.

Exit mobile version